Samrat Choudhary: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌధరీ
Samrat Choudhary: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది.
Samrat Choudhary: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌధరీ
Samrat Choudhary: బిహార్‌లో గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరును పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏకగ్రీవ ఎన్నిక:
బిహార్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ సామ్రాట్ చౌదరిని అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బిహార్ అభివృద్ధిలో సామ్రాట్ చౌదరి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
రేపే ప్రమాణ స్వీకారం:
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి రేపు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ కుమార్ 21 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగియడంతో, బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టబోతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సామ్రాట్ చౌదరి నాయకత్వంలో రాష్ట్ర పాలన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.




