Paralakhemundi: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. వాకథాన్ నిర్వహణ!

Paralakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండిలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వాకథాన్ చేపట్టారు.

S.Anil, Gajapati Dst
Published on: 1 Nov 2026 9:40 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. వాకథాన్ నిర్వహణ!

Paralakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని గజపతి క్రీడా మైదానం ప్రాంతం నుంచి మహారాజ బాలుర పాఠశాల కూడలి ప్రాంతం మీదుగా రాజుగారి కోట వద్దకు వాకథాన్ నిర్వహించారు.

అంతకు ముందు ఎస్పీ ప్రహ్లాద్ సహాని మీనా జెండా ఊపి ర్యాలీ ప్రారంబించారు.ఎస్పీ ప్రహ్లాద్ మాట్లాడుతూ పటేల్ చూపిన మార్గంలో దేశాన్ని బలంగా స్వయం సమృద్ధిగా ఇచ్చిన సంకల్పాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ బిరంచి బాగ్, ఎస్డీపీవో మాధవ నంద నాయక్,ఠాణా అధికారి ప్రశాంత్ కుమార్ భూపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst