Paralakhemundi: నిరుపేదలకు అండగా నిలుస్తున్న సేవా జ్యోతి ట్రస్ట్!
Paralakhemundi: ఒడిశా గజపతి జిల్లా కాశీనగర్ సమితి రాణిపేటలో సేవా జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు, రూ.1000 ఆర్థిక సాయం పంపిణీ.
Paralakhemundi: నిరుపేదలకు అండగా నిలుస్తున్న సేవా జ్యోతి ట్రస్ట్!
Paralakhemundi: నిరుపేదలకు నిత్యవసర సరుకులు తో పాటు ఆర్థిక సహాయం చేస్తూ గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కాశీనగర్ సమితి రాణి పేట గ్రామానికి చెందిన సేవా జ్యోతి ట్రస్ట్ పి రవి. వివరాల్లో వెళితే గత రెండు నెలలుగా నిరుపేద కుటుంబాలైన పలువురికి రూ 1000 తో పాటు నిత్యవసర సరుకులను అందజేస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో ఆరుగురు సభ్యులతో ప్రారంభించి అక్టోబర్ నెల 11 మందికి సహాయం చేశారు.
ఆదివారం రాత్రి రాణిపేట గ్రామంలోని శివాలయ ప్రాంతంలో గల మండపం వద్ద సేవా జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రవి మాట్లాడుతూ రాణిపేట గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ ఆర్థిక సహాయం ప్రతినెల అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా విద్య ఆరోగ్యపరంగా వారికి అన్నివేళల సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.




