Sharad Pawar Hospitalized: శరద్ పవార్ అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
Sharad Pawar Hospitalized: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత, సీనియర్ రాజకీయ దిగ్గజం శరద్ పవార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
Sharad Pawar Hospitalized: శరద్ పవార్ అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
Sharad Pawar Hospitalized: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత, సీనియర్ రాజకీయ దిగ్గజం శరద్ పవార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను పూణేలోని ప్రసిద్ధ రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు. ప్రస్తుతం 85 ఏళ్ల శరద్ పవార్‌కు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుమార్తె, బారామతి లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు.
దగ్గుతో ప్రారంభమైన ఛాతి నొప్పి.. వైద్యుల పర్యవేక్షణలో శరద్ పవార్
శరద్ పవార్‌కు ఇటీవల దగ్గు రావడం, ఆ తర్వాత ఛాతిలో నొప్పి ప్రారంభం కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, ఛైర్మన్ డాక్టర్ పుర్వేజ్ కె. గ్రాంట్ మాట్లాడుతూ.. శరద్ పవార్ త్వరలోనే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. ఆయనకు 'ఫ్లూరిటిక్ పెయిన్' (Pleuritic pain) లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా గాలి పీల్చేటప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఛాతిలో నొప్పి మరింత తీవ్రమయ్యే ఈ సమస్యకు ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోందని, నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.




