Shehzad Poonawalla: బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా..

Shehzad Poonawalla: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా పార్టీకి రాజీనామా. వ్యక్తిగత కారణాలతో నిర్ణయం.. 'ఎక్స్' ప్రొఫైల్ లో బయో మార్పు.

Arun Chilukuri
Published on: 31 July 2026 2:50 PM IST
Shehzad Poonawalla
X

Shehzad Poonawalla: బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా..

Shehzad Poonawalla: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధికార ప్రతినిధి, టీవీ చర్చల్లో నిత్యం పార్టీ తరఫున బలమైన గళం వినిపించే షెహ్‌జాద్‌ పూనావాలా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజీనామా వార్తల నడుమ షెహ్‌జాద్‌ తన అధికారిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతా ప్రొఫైల్‌ నుంచి ‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి’ అనే ట్యాగ్‌ను తొలగించారు. అయితే, ‘ప్రధాని నరేంద్ర మోదీ జీవితకాల అనుచరుణ్ని’ అనే ట్యాగ్‌లైన్‌ను మాత్రం అలాగే కొనసాగించడం గమనార్హం.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన షెహ్‌జాద్‌ పూనావాలా తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌ పార్టీలో ప్రారంభించారు. 2017లో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికే ఆ ప్రక్రియంతా నామమాత్రంగా సాగిందని అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఆ తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన, జాతీయ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఇటీవలే "రాజకీయాల నుంచి తప్పుకొనే సమయం వచ్చింది" అని ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్న వీడియోను షెహ్‌జాద్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఆయన సోదరుడు తహసీన్ పూనావాలా కాంగ్రెస్‌కు మద్దతుగా టీవీ డిబేట్లలో పాల్గొంటుంటారు. వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున ఈ ఇద్దరు సోదరులు వినిపించే వాదనలు తరచూ చర్చనీయాంశమయ్యేవి. ప్రస్తుతానికి షెహ్‌జాద్‌ రాజీనామా వ్యవహారంపై బీజేపీ అధిష్ఠానం గానీ, ఆయన గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story