Karnataka: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత!

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ అప్‌డేట్. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 28 May 2026 3:18 PM IST
Karnataka
X

Karnataka: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత!

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) అధికారికంగా రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన తన నివాసం నుంచి బయలుదేరి, కాబోయే నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్‌కు చేరుకున్నారు.

అయితే, సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్లే సమయానికి రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ అక్కడ అందుబాటులో లేరు. దీంతో సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి (Secretary) అందజేశారు. ఈ రాజీనామా సమర్పణతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పు ప్రక్రియ అధికారికంగా మొదటి దశను పూర్తి చేసుకుంది.

త్వరలోనే గవర్నర్ బెంగళూరుకు చేరుకున్న తర్వాత రాజీనామాను ఆమోదించనున్నారు. ఆ వెంటనే శనివారం నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయడానికి లైన్ క్లియర్ కానుంది. రాజీనామా అనంతరం సిద్ధరామయ్య తన నివాసంలో మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు వెల్లడించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story