SIR: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో ఒకటైన సోదరులు.. హరియాణాలో భావోద్వేగ సన్నివేశం

SIR: ఓటర్ల జాబితా సవరణ ‘సర్‌’ ప్రక్రియ కారణంగా 35 ఏళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Sept 2026 11:34 AM IST
SIR
X

SIR: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో ఒకటైన సోదరులు.. హరియాణాలో భావోద్వేగ సన్నివేశం

SIR: ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పరిశీలన (‘సర్‌’) ప్రక్రియ అన్నాదమ్ములను ఒకచోట చేర్చింది. సుమారు 35 ఏళ్ల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు సోదరులు ఈ సర్వే పుణ్యమా అని మళ్లీ కలుసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నివసిస్తున్న 55 ఏళ్ల సీతారాం.. ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం ధ్రువపత్రం కోసం హరియాణాలోని జీంద్ జిల్లా మనోహర్‌పుర్‌ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు.

అక్కడ ఆయన తన పెద్ద అన్నయ్య దల్బీర్ సింగ్ (60) గురించి వివరాలు తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కిషన్‌ కుమార్‌కు దల్బీర్ సింగ్ పరిచయం ఉండటంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తమ్ముడు సీతారాం వచ్చాడనే విషయం విన్న వెంటనే దల్బీర్ సింగ్ పరుగులు పెడుతూ స్కూలుకు చేరుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా విడిపోయిన అన్నదమ్ములు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే ఉద్వేగానికి లోనయ్యారు. పరస్పరం హత్తుకుని కన్నీటి పర్యంతమైన తీరు అక్కడున్న వారిని సైతం భావోద్వేగానికి గురిచేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story