Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Published on: 1 Sept 2026 11:49 AM IST
Anna Hazare
X

Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన్ని మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి నుంచి హుటాహుటిన ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ముంబైలోని బాంబే ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

89 ఏళ్ల అన్నా హజారే వైరల్ ఇన్‌ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. తొలుత రాలేగావ్‌ సిద్ధిలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైలోని బాంబే ఆస్పత్రికి మార్చారు.

ప్రముఖ వైద్యుడు గౌతమ్ భన్సాలీ ఆధ్వర్యంలో వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. పరీక్షల అనంతరం పూర్తి హెల్త్ బులిటెన్ వెలువడే అవకాశం ఉంది.

దేశంలో అహింసా మార్గంలో అనేక సత్యాగ్రహాలు, 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టిన అన్నా హజారే.. 'ఇండియా అగైనెస్ట్ కరప్షన్' (IAC) ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల నీట్ (NEET) విద్యార్థులకు మద్దతుగా కూడా ఆయన మౌన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story