Sonam Wangchuk: ఆసుపత్రిలో సోనమ్ వాంగ్‌చుక్.. భార్య సంచలన వ్యాఖ్యలు!

Sonam Wangchuk: దిల్లీ జంతర్‌మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Arun Chilukuri
Published on: 18 July 2026 11:04 AM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk: ఆసుపత్రిలో సోనమ్ వాంగ్‌చుక్.. భార్య సంచలన వ్యాఖ్యలు!

Sonam Wangchuk: దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వాంగ్‌చుక్‌కు తగిన వైద్య సహాయం అందించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోనమ్ వాంగ్‌చుక్ గత నెలాఖరులో ఈ దీక్షను ప్రారంభించారు. సుదీర్ఘంగా దీక్ష కొనసాగడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను తరలిస్తున్న సమయంలో జంతర్‌మంతర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాంగ్‌చుక్ మద్దతుదారులు, నిరసనకారులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. "ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. జంతర్‌మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించి, వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి" అని దిల్లీ పోలీసులు 'ఎక్స్' వేదికగా కోరారు.

నా అనుమతి లేకుండా చికిత్స వద్దు: వాంగ్‌చుక్ భార్య

మరోవైపు తన భర్తకు బలవంతంగా చికిత్స అందించడంపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి వైద్యం అందించవద్దని ఆమె డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. "ఆయన నిన్నటివరకు బాగానే ఉన్నారు, ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదు. మా వ్యక్తిగత వైద్యుడి అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స చేయకూడదు, అది మా హక్కు. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే ఇందుకు ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తాను" అని ఆమె హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story