Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
Sonia Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రతను గతంలో ఉద్దేశపూర్వకంగానే తొలగించారని సోనియా గాంధీ ఆరోపించారు.
Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
Sonia Gandhi: తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలకు హాని తలపెట్టేందుకే గతంలో ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తమ కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ జరిపిన భావోద్వేగ సంభాషణను సోనియా ‘ఎక్స్’ (X) వేదికగా పంచుకున్నారు.
బిహార్ పర్యటనలో రాళ్ల దాడి.. రాహుల్ కన్నీరు
రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లేవారని, అప్పుడు కొందరు కుట్రపూరితంగా ఆయనపై దాడులకు పాల్పడేవారని సోనియా తెలిపారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను తగ్గించిందని ఆరోపించారు. "1991 మార్చిలో రాజీవ్ ఓపెన్ జీపులో బిహార్‌లో ప్రయాణిస్తుండగా అల్లరి మూకలు ఆయనపై రాళ్లు రువ్వాయి. పర్యటనను అడ్డుకునేందుకు నిరసనలు చేపట్టారు. అది అత్యంత భయంకరమైన సందర్భం. ఆ పర్యటనకు తండ్రితో పాటు వెళ్లిన రాహుల్.. ఆ రాళ్ల దాడిని ప్రత్యక్షంగా చూశాడు. ఇంటికి రాగానే నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. 'నాన్న భద్రత కోసం మనం ఏమీ చేయకపోతే ఆయన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది' అని తీవ్ర ఆందోళన చెందాడు. అంత జరిగినా అప్పటి ప్రభుత్వం రాజీవ్‌కు సెక్యూరిటీ పెంచలేదు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన ప్రాణాలు కోల్పోయారు" అని సోనియా గాంధీ నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు.
భారత్‌కు వచ్చిన తొలిరోజుల జ్ఞాపకాలు
1968లో ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత తన తొలిరోజులను కూడా సోనియా గాంధీ ఈ సంభాషణలో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దేశంలోని పేదరికాన్ని చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన తల్లి ఆత్మకథ పుస్తకంలో తమ కుటుంబం గురించి 500కు పైగా పేజీలు రాసినప్పటికీ, ఆమె పంచుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు.




