ఆగస్టు 17 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? కేంద్రం బిగ్ ప్లాన్!

Special Parliament Sessions: ఆగస్టు 17 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 3:43 PM IST
ఆగస్టు 17 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? కేంద్రం బిగ్ ప్లాన్!
X

Special Parliament Sessions: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల (Women's Quota Bill) ఆమోదం కోసం ఆగస్టు 17 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ, సభను నిరవధికంగా వాయిదా వేయకుండా.. ఆగస్టు 17 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల (2/3rd) మెజారిటీ సాధించేందుకు కేంద్రం వివిధ పార్టీలతో చర్చలు జరుపుతోంది. సంఖ్యాబలంపై స్పష్టత వచ్చాక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఛాంబర్‌కు వెళ్లి భేటీ అయ్యారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు.

అయితే కేంద్ర మంత్రి అభ్యర్థనను రాహుల్ గాంధీ తిరస్కరించారు. అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ, సీజేపీ (CJP) నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసే వరకు ఎలాంటి బిల్లులకూ సహకరించబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల అనంతరం సభలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story