Anudeep Katikala: పవన్, నిహారికలపై కామెంట్స్.. కమెడియన్ అనుదీప్ కటికల అరెస్ట్!

Anudeep Katikala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను కాకినాడ పోలీసులు యూపీలో అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 15 April 2026 1:05 PM IST
Anudeep Katikala
X

Anudeep Katikala: పవన్, నిహారికలపై కామెంట్స్.. కమెడియన్ అనుదీప్ కటికల అరెస్ట్!

Anudeep Katikala: ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న సమయంలో కాకినాడ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

తన కామెడీ షోలో భాగంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరియు నిహారిక కొణిదెల విడాకుల అంశంపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలోనే అనుదీప్ స్పందిస్తూ.. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశ్యం కాదని, కేవలం సమాజంలో ఉన్న ధోరణిని హాస్యంగా చెప్పానని వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.

అనుదీప్ క్షమాపణలు చెప్పినప్పటికీ, పరువు నష్టం మరియు మహిళల గౌరవానికి భంగం కలిగించారనే అభియోగాలపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన్ను విచారణ నిమిత్తం యూపీ నుంచి కాకినాడకు తరలిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story