Super El Nino: భారత్‌కు ఎల్ నినో డేంజర్ బెల్స్.. అక్టోబర్ - మార్చి మధ్య 55,000 మంది బలి అయ్యే ఛాన్స్!
Super El Nino: ప్రపంచంపై సూపర్ ఎల్ నినో పడగ. రానున్న 6 నెలల్లో 3.73 లక్షల అదనపు మరణాలు.. భారత్‌లోనే 55 వేల మందికి ముప్పు అని హెచ్చరించిన మోర్టాలిటీ ట్రాకర్.
Super El Nino: భారత్‌కు ఎల్ నినో డేంజర్ బెల్స్.. అక్టోబర్ - మార్చి మధ్య 55,000 మంది బలి అయ్యే ఛాన్స్!
Super El Nino: ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ మార్పులు సృష్టిస్తున్న 'సూపర్ ఎల్ నినో' (Super El Nino) పై విపత్తు నివేదిక తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఒకవైపు తీవ్ర కరువు, మరోవైపు ఆకస్మిక వరదలు, తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో 'ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్' విడుదల చేసిన నూతన అంచనాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
రానున్న ఆరు నెలల్లో సాధారణ వేసవి మరణాల కంటే అదనంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత్‌పై ఎల్ నినో ప్రభావం దారుణంగా ఉండనుందని, ఈ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య సుమారు 55,000 మరణాలు సంభవించవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా మార్చి నెలలోనే అత్యధిక మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది.
నైజీరియాలో 56,000, ఇండోనేషియాలో 29,000, బ్రెజిల్‌లో 19,000 చొప్పున వేడి తీవ్రతకు మరణాలు సంభవించవచ్చని పేర్కొంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన 'గ్లోబల్ సౌత్' దేశాల్లో వడగాలుల తీవ్రత, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండనుంది.
1950 తర్వాత భూగోళంపై అత్యంత బలమైన ఎల్ నినో వ్యవస్థ ఇదేనని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది. దీని దుష్ప్రభావాలు 2027 వరకు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
"తీవ్రమైన వేడి ప్రభావాలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రజలకు ఎక్కడ ఎక్కువ ప్రమాదం ఉందో అంచనా వేసి, ప్రాణనష్టం జరగకముందే ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి వీలేర్పడుతుంది" అని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు మైఖెల్ గ్రీన్‌స్టోన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.




