Supreme Court: బిహార్ ‘సర్‌’ కేసులో ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం: "ఫారం-6 సవరణలను మేం ఆమోదించలేదు!"

Supreme Court: బిహార్ ‘సర్‌’ (SIR) ప్రక్రియలో ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది.

Arun Chilukuri
Published on: 12 Oct 2026 4:28 PM IST
Supreme Court
X

Supreme Court: బిహార్ ‘సర్‌’ కేసులో ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం: "ఫారం-6 సవరణలను మేం ఆమోదించలేదు!"

Supreme Court: బిహార్‌ ‘సర్‌’ (SIR) ప్రక్రియకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6 (Form-6) మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ ఫారంలో తాము ఎలాంటి సవరణలను ఆమోదించలేదని, అలాగని తిరస్కరించలేదని ప్రధాన జస్టిస్‌ (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బిహార్‌ సర్‌కు సంబంధించి తీర్పు వెలువడిన సమయంలో ఈ సవరించిన కొత్త ఫారం-6 లేదని పేర్కొంది.

కొత్త ఫారం డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఎన్నికల సంఘం (ECI) ప్రచారం చేసిందన్న వాదనపై విచారణ సందర్భంగా ఈ స్పష్టత వెలువడింది. చట్టబద్ధమైన నిబంధనలు మార్చకుండా ఎన్నికల సంఘం ఫారం-6లో ఏకపక్షంగా మార్పులు చేసిందని, పైగా ఆ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని తప్పుడు ప్రచారం చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం.. తాము ఆ సవరణలను ఎప్పుడూ పరిశీలించలేదని, కాబట్టి వాటిని ఆమోదించినట్లుగా గానీ, వ్యతిరేకించినట్లుగా గానీ భావించలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి పూర్తి రికార్డులు అందిన తర్వాత ఫారంలో మార్పులు ఎవరు చేశారనేదానిపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.