Supreme Court: క్యాన్సర్ మందుల అధిక ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అన్ని ఔషధాలపై 16 శాతం మార్జిన్ ఉండాలని సూచన!
Supreme Court: క్యాన్సర్ మందులను అధిక ధరకు విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: క్యాన్సర్ మందుల అధిక ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అన్ని ఔషధాలపై 16 శాతం మార్జిన్ ఉండాలని సూచన!
Supreme Court: క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులను అత్యధిక ధరకు విక్రయిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
రిటైలర్లకు కేవలం రూ.2,700లకే సరఫరా అవుతున్న ఒక ప్రాణాలను కాపాడే క్యాన్సర్ ఔషధంపై ఏకంగా రూ.27 వేల ఎంఆర్‌పీ (MRP) ముద్రించడం పట్ల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సామాన్య రోగులకు మోయలేని భారంగా మారుతోందని పేర్కొంది. దేశంలోని అన్ని రకాల మందులపై ఏకరీతిగా కేవలం 16 శాతం మాత్రమే మార్జిన్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
రోగులు బయట మందులు కొనుగోలు చేయడానికి వీలు లేకుండా, తమ ఆస్పత్రులకు చెందిన మెడికల్ షాపుల నుంచే కచ్చితంగా మందులు కొనాలని కొన్ని ఆస్పత్రులు నిర్దేశించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. ఈ దోపిడీ విధానం వల్ల సామాన్యుడే తీవ్రంగా నష్టపోతున్నాడని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.




