CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్.. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు డిమాండ్!

CEC Gyanesh Kumar: ఎన్నికల సంఘంలో 'సర్‌' అంశంపై విభేదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కోరుతూ న్యాయవాది పిటిషన్ వేశారు.

Arun Chilukuri
Published on: 25 Sept 2026 3:19 PM IST
CEC Gyanesh Kumar
X

CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్.. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు డిమాండ్!

CEC Gyanesh Kumar: ఎన్నికల సంఘంలో 'సర్‌' (SIR) అంశంపై విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్ఞానేశ్‌ కుమార్‌పై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా జ్ఞానేశ్‌ కుమార్ తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. 'సర్‌'కు సంబంధించిన నిర్ణయాలు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ ‘ఫామ్‌-6’ను పునరుద్ధరించాలని అభ్యర్థించారు.

ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారన్న ఆరోపణలపై సిట్‌ (SIT)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ మనీశ్‌ గార్గ్‌, ఈసీ ఐటీ హెడ్‌ సీమా ఖన్నాపై క్రిమినల్‌ విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జెన్‌-జీ (Gen-Z) యువతకు ఓటు హక్కు కల్పించకుండా సీఈసీ అడ్డుకుంటున్నారని ఆరోపించింది. 2024 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయడం ద్వారా 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని దెబ్బతీశారని విమర్శించింది. ఓవైపు యువతకు ఓటు హక్కు లేకుండా చేస్తూ.. మరోవైపు ఓటు బాధ్యతలపై ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఓటు చోరీ అంశం బయటపడిన తర్వాతే సీఈసీ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.