Supreme Court: న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లకు సుప్రీంకోర్టు షాక్!
Supreme Court: సుప్రీంకోర్టు వరకు పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.
Supreme Court: న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లకు సుప్రీంకోర్టు షాక్!
Supreme Court: సుప్రీంకోర్టు ప్రాంగణానికి రాజకీయ నాయకులు చేపట్టిన పాదయాత్ర, నిరసనలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలు, నిరసనల కోసం కోర్టు ప్రాంగణాన్ని వాడుకోవడం, న్యాయస్థానం వరకు పాదయాత్రలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
నిరసనలతో న్యాయవ్యవస్థను బెదిరించలేరని, కోర్టులపై ఒత్తిడి తెచ్చేందుకు చేసే ఇలాంటి బలహీన చర్యలను ఎవరూ పట్టించుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు ప్రాంగణానికి వ్యతిరేకంగా నిర్వహించిన పాదయాత్రను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ మరియు ఇతర నాయకులకు నోటీసులు అందజేసింది.
కోర్టు పరిసరాల్లో నిరసనలు, పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలు, సీసీటీవీ రికార్డింగ్‌లు, వీడియో ఫుటేజీలను క్షేమంగా భద్రపరచాలని పోలీసు అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.




