Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే!
Pawan Khera: అస్సాం సీఎం భార్య ఫిర్యాదుతో నమోదైన కేసులో పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే!
Pawan Khera: కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అస్సాంలోని గువాహటిలో నమోదైన ఒక కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే నిలిపివేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పవన్ ఖేరాపై గువాహటిలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయ్యే అవకాశం ఉన్నందున, ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అస్సాంలోని సంబంధిత కోర్టును సంప్రదించడానికి సమయం ఇస్తూ, హైకోర్టు గత శుక్రవారం పవన్ ఖేరాకు వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిని ప్రశ్నిస్తూ బెయిల్‌పై స్టే ఇచ్చింది. దీంతో పవన్ ఖేరా ఇప్పుడు అస్సాం పోలీసుల చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా నేరుగా అస్సాం న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది.




