Maharashtra: సావిలీ అడవుల్లో కలకలం రేపిన టి-122 పులి బంధనం!

Maharashtra: చంద్రపూర్ జిల్లా సావిలీ అడవుల్లో ముగ్గురిని బలితీసుకున్న టి-122 పులిని బంధించిన మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు. నిరంతర గాలింపుతో ఎట్టకేలకు చిక్కిన పులి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Sept 2026 2:49 PM IST
Maharashtra
X

Maharashtra: సావిలీ అడవుల్లో కలకలం రేపిన టి-122 పులి బంధనం!

Maharashtra: చంద్రపూర్ జిల్లా సావిలీ అటవీ ప్రాంతంలో గత మూడు నెలలుగా స్థానికులను భయాందోళనకు గురిచేసిన టి-122 పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. వరుస దాడులతో అప్రమత్తమైన అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

టి-122 పులి గత మూడు నెలల్లో ముగ్గురిపై దాడి చేసి హతమార్చడంతో పాటు మరో వ్యక్తిని గాయపరిచినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో సావిలీ అటవీ ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పులి సంచారంపై నిఘా పెంచిన అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్‌లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పులిని వెంటనే బంధించి స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని అటవీశాఖ చీఫ్ సెక్రెటరీ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్‌లో టి-122 పులిని అధికారులు సురక్షితంగా బంధించారు. పులి పట్టుబడటంతో సావిలీ పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన పులిని తదుపరి చర్యల కోసం అటవీశాఖ అధికారులు తరలించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.