Tamil Nadu Assembly Elections 2026: 6వ తరగతి చదువు.. రూ.5,863 కోట్ల ఆస్తులు.. అన్నాడీఎంకే అభ్యర్థి అఫిడవిట్ వైరల్!

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఒక అఫిడవిట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Arun Chilukuri
Published on: 7 April 2026 10:31 AM IST
Leema Rose
X

Tamil Nadu Assembly Elections 2026: 6వ తరగతి చదువు.. రూ.5,863 కోట్ల ఆస్తులు.. అన్నాడీఎంకే అభ్యర్థి అఫిడవిట్ వైరల్!

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఒక అఫిడవిట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుచిరాపల్లి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే (AIADMK) తరఫున బరిలోకి దిగిన లీమా రోజ్, తన కుటుంబ ఆస్తుల విలువను ఏకంగా రూ.5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త, 'లాటరీ కింగ్' గా పిలవబడే మార్టిన్ భార్య.

ఆస్తుల చిట్టా ఇదీ.. (అఫిడవిట్ ప్రకారం):

లీమా రోజ్ సమర్పించిన వివరాల ప్రకారం ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల విభజన ఇలా ఉంది:

లీమా రోజ్: రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల స్థిరాస్తులు.

భర్త (మార్టిన్): రూ.3,262 కోట్ల చరాస్తులు, రూ.887 కోట్ల స్థిరాస్తులు.

కుమారుడు (జోస్ టైసన్): రూ.225 కోట్ల చరాస్తులు, రూ.439 కోట్ల స్థిరాస్తులు.

మొత్తం కుటుంబ ఆస్తి: రూ.5,863.38 కోట్లు.

బంగారం, వజ్రాల రాశి:

ఆస్తులతో పాటు ఆమె వద్ద ఉన్న ఆభరణాల వివరాలు కూడా కళ్లు చెదిరేలా ఉన్నాయి. లీమా రోజ్ వద్ద 19,233 గ్రాముల (సుమారు 19 కేజీలు) బంగారం, 1,31,813 గ్రాముల (131 కేజీల పైచిలుకు) వెండి, మరియు 1,217 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

చదువు ఆరో తరగతే.. కేసులు కూడా!

అంతేకాకుండా, లీమా రోజ్ తన విద్యార్హతను 6వ తరగతిగా పేర్కొన్నారు. తనపై ఆదాయపు పన్ను శాఖ మరియు ఇడి (ED) సంబంధిత వ్యవహారాలతో కూడిన నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆమె వ్యక్తిగత ఆదాయం రూ.9.82 కోట్లు కాగా, ఆమె భర్త ఆదాయం రూ.11.39 కోట్లుగా చూపించారు.

తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరిగా లీమా రోజ్ నిలిచారు. ప్రస్తుతం ఈ అఫిడవిట్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీల విమర్శలకు కూడా వేదికగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story