CM Vijay: రైతులకు సీఎం విజయ్ బిగ్ రిలీఫ్.. రూ.75,000 వరకు పంట రుణాలు పూర్తి మాఫీ!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.
CM Vijay: రైతులకు సీఎం విజయ్ బిగ్ రిలీఫ్.. రూ.75,000 వరకు పంట రుణాలు పూర్తి మాఫీ!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర రైతాంగానికి మంగళవారం భారీ ఊరటనిచ్చారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ (Crop Loan Waiver) వర్తింపజేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. గత నెలలో ప్రకటించిన నిబంధనలపై రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో, సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ పథకంలో కీలక మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
సహకార బ్యాంకుల్లో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న సన్న, చిన్న, పెద్ద రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా రుణమాఫీ కానుంది. ఒకవేళ రుణం మొత్తం రూ. 75 వేల కంటే ఎక్కువగా ఉంటే, సదరు రైతులకు ఒక్కొక్కరికి రూ. 35,000 చొప్పున ప్రభుత్వం మాఫీ చేయనుంది.
గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు పూర్తి మాఫీ, చిన్న రైతులకు 50 శాతం మాఫీ, పెద్ద రైతులకు కేవలం రూ. 5 వేల వరకు మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతుల విజ్ఞప్తులను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం విజయ్, వర్గాల వారీగా కాకుండా అందరికీ ప్రయోజనం చేకూరేలా రూ. 75 వేల పరిమితితో కొత్త మార్గదర్శకాలను ఖరారు చేశారు.
ఈ తాజా సవరించిన రుణమాఫీ నిర్ణయం ద్వారా తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5,932 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ప్రజాకర్షక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీఐ (RBI) నిబంధనలకు లోబడి, రుణమాఫీ కింద సహకార బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయి మొత్తాన్ని 45 నుంచి 60 రోజుల్లోగా ప్రభుత్వం పూర్తిగా రీఇంబర్స్ చేస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.




