Tamil Nadu: ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
Tamil Nadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
Tamil Nadu: ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభించిన నూతన ముఖ్యమంత్రి విజయ్ నేడు హస్తినకు పయనం కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈ టూర్ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దేశ రాజధానికి వెళ్తున్న విజయ్.. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానితో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా సీఎం విజయ్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళనాడులో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ పొలిటికల్ మీటింగ్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేవలం మర్యాదపూర్వక పర్యటనగానే చెప్తున్నప్పటికీ.. కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి మరియు రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సీఎం విజయ్ ఈ ఢిల్లీ టూర్‌ను ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా విజయ్ ఢిల్లీ నేతలతో భేటీ అయ్యేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది.




