CM Vijay: ఇంద్రకీలాద్రిపై సీఎం విజయ్.. విజయవాడలో అభిమానుల సందడి!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
CM Vijay: ఇంద్రకీలాద్రిపై సీఎం విజయ్.. విజయవాడలో అభిమానుల సందడి!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు విజయ్‌కు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని ఇచ్చారు.
కనకదుర్గమ్మ దర్శనం అనంతరం విజయ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు బయల్దేరనున్నారు. అలాగే, ఈ రాత్రి విజయవాడలో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్’లో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి ఏపీకి రావడంతో ఆయన పర్యటనపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
విజయ్ రాక నేపథ్యంలో విజయవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయ్ను చూసేందుకు ఉత్సాహం చూపిన అభిమానులు, ఆయన ప్రయాణిస్తున్న కారు వెంట పరుగులు తీశారు. దీంతో నగరంలో ఆయన పర్యటన చర్చనీయాంశంగా మారింది.




