CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం దుకాణాలు బంద్!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం. పాఠశాలలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశం. రెండు వారాల్లోగా అమలు చేయాలని ఉత్తర్వులు.

Arun Chilukuri
Updated on: 12 May 2026 10:07 AM IST
CM Vijay
X

CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తమిళనాడులో 717 మద్యం దుకాణాలు బంద్!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన ముద్ర వేస్తున్న విజయ్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల శ్రేయస్సు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన 717 మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 తస్మాక్ (TASMAC) రిటైల్ దుకాణాలు ఉండగా, తాజా నిబంధనలతో ఈ క్రిందివి మూతపడనున్నాయి.

ప్రార్థనా స్థలాల సమీపంలో: 276 దుకాణాలు

విద్యాసంస్థల వద్ద: 186 దుకాణాలు

బస్టాండ్‌ల పరిసరాల్లో: 255 దుకాణాలు

తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 717 దుకాణాలను రెండు వారాల్లోగా పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు, విద్యావేత్తల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story