Tamil Nadu Election 2026: తమిళనాడులో 9 గంటలకే భారీ పోలింగ్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Tamil Nadu Election 2026: తమిళనాడులో పోలింగ్ జాతర. ఉదయం 9 గంటలకే 17.69% ఓటింగ్ నమోదు. ఓటేసిన రజనీకాంత్, విజయ్, స్టాలిన్. పోలింగ్ సమయం పొడిగించాలని విజయ్ విజ్ఞప్తి.

Arun Chilukuri
Published on: 23 April 2026 10:41 AM IST
Tamil Nadu Election 2026
X

Tamil Nadu Election 2026: తమిళనాడులో 9 గంటలకే భారీ పోలింగ్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Tamil Nadu Election 2026: తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం 9 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 17.69 శాతం ఓటింగ్ నమోదైంది.

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఎన్నికల సంఘానికి కీలక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత, ప్రయాణ అంతరాయాలు మరియు క్యూలైన్లలో ఓటర్లు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు (అదనంగా 2 గంటలు) పొడిగించాలని ఆయన కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్లు:

సీఎం ఎంకే స్టాలిన్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ తెల్ల చొక్కా ధరించి సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఓటు వేశారు. నటులు అజిత్ కుమార్, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 4,000 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉండగా, మే 4న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story