Tamil Nadu Elections 2026: ఎన్నికల బరిలో ఏఐ 'విజయ్': హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో టీవీకే సరికొత్త ప్రచారం!

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐ హోలోగ్రామ్ సంచలనం సృష్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 13 April 2026 12:31 PM IST
Tamil Nadu Elections 2026
X

Tamil Nadu Elections 2026: ఎన్నికల బరిలో ఏఐ 'విజయ్': హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో టీవీకే సరికొత్త ప్రచారం!

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రాజకీయం డిజిటల్ యుగంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటం, అధినేత అన్ని చోట్లకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో 'తమిళ వెట్రి కళగం' (TVK) అభ్యర్థులు అత్యాధునిక సాంకేతికతను నమ్ముకున్నారు. ఇందులో భాగంగా ప్రచార బరిలోకి 'హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్' సాంకేతికతను తీసుకువచ్చి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.

ఈ టెక్నాలజీ ద్వారా టీవీకే అధినేత విజయ్ నియోజకవర్గాల్లోని ప్రజల ముందుకు నేరుగా వచ్చి మాట్లాడుతున్న అనుభూతిని కలిగిస్తున్నారు. కుంభకోణంలో నిర్వహించిన ప్రచారంలో స్టేజీపై విజయ్ స్వయంగా ఉన్నట్లు కనిపించడంతో జనం భారీగా తరలివచ్చారు.

234 నియోజకవర్గాలున్న తమిళనాడులో ప్రతి చోటకూ స్వయంగా వెళ్లడం కష్టమైన నేపథ్యంలో, ఏఐ ద్వారా రూపొందించిన ఈ హోలోగ్రామ్‌లు పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. విజయ్ ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఏఐ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రచారంలో దూకుడు పెంచిన విజయ్ పార్టీ, ఏఐ అస్త్రంతో యువతను మరియు టెక్-సావీ ఓటర్లను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ ప్రచారానికి స్వస్తి పలుకుతూ టెక్నాలజీతో ఓటర్ల వద్దకు వెళ్తున్న ఈ పద్ధతి భవిష్యత్ ఎన్నికల ప్రచార శైలికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story