Aadhav Arjuna: 14 ఏళ్ల అనుబంధానికి ఫుల్‌స్టాప్.. మంత్రి భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Aadhav Arjuna: తమిళనాడు రాజకీయ నాయకుడు ఆధవ్ అర్జున, ఆయన భార్య డైసీ మార్టిన్ తమ 14 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు.

Arun Chilukuri
Published on: 16 Nov 2026 4:35 PM IST
Aadhav Arjuna
X

Aadhav Arjuna: 14 ఏళ్ల అనుబంధానికి ఫుల్‌స్టాప్.. మంత్రి భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Aadhav Arjuna: తమిళనాడు ప్రముఖ రాజకీయ నాయకుడు ఆధవ్‌ అర్జున తన భార్య డైసీ మార్టిన్‌తో విడిపోయారు. తమ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డైసీ మార్టిన్‌ సోషల్ మీడియా వేదికగా (ఇన్‌స్టాగ్రామ్) అధికారికంగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

విడిపోతున్న విషయాన్ని వెల్లడిస్తూ డైసీ మార్టిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అందులో ఆమె ఏం పేర్కొన్నారంటే.. ‘‘గత 14 ఏళ్లుగా మంచి స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా జీవితంలోని ఎన్నో దశలను ఎంతో ప్రేమతో కలిసి దాటాము. అయితే, ఇకపై మా వివాహ బంధానికి ముగింపు పలికి, ఎవరి దారి వారు చూసుకోవాలని (వేర్వేరు మార్గాలను అనుసరించాలని) పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం.’’

‘‘ఇది మా ఇద్దరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం అయినప్పటికీ.. మా బిడ్డను పెంచడంలో, సంతోషంగా ఉండేలా చూసుకోవడంలో తల్లిదండ్రులుగా మేమిద్దరం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటాం. మా బిడ్డ సంతోషం, శ్రేయస్సే మా ఉమ్మడి ప్రాధాన్యాలు.’’ ‘‘ఆధవ్ అర్జునపై నాకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. ఆయన ఎంచుకున్న ప్రతి రంగంలోనూ సంతోషం, శాంతి, విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సున్నితమైన దశలో మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని, సానుభూతితో వ్యవహరిస్తూ మా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తారని కోరుకుంటున్నాం’’ అని డైసీ మార్టిన్‌ తన పోస్ట్‌లో వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.