Tamil Nadu: పెళ్లి పేరుతో బాలికను తీసుకెళ్లి దారుణం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలిలో మైనర్‌పై సామూహిక అత్యాచారం కేసులో ఒక నిందితుడికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.
Tamil Nadu: పెళ్లి పేరుతో బాలికను తీసుకెళ్లి దారుణం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఇద్దరు నిందితులకు కూడా జైలు శిక్ష ఖరారు చేసింది.
తిరునెల్వేలికి చెందిన 16 ఏళ్ల బాలికకు 2022లో పెయింటర్‌గా పనిచేస్తున్న మునీశ్వరన్ పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మీనాక్షిపురం తీసుకెళ్లాడు. అక్కడ మునీశ్వరన్ తన స్నేహితులు చిన్నకుట్టి, మురుగేశన్‌తో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ దారుణంపై బాధితురాలు కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో చిన్నకుట్టికి మరణశిక్ష విధించగా.. మురుగేశన్‌కు 20 ఏళ్లు, మునీశ్వరన్‌కు 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.




