Palaniswami: తమిళనాడులో కొత్త ప్రభుత్వం.. పళనిస్వామి సంచలన పోస్ట్..!
Palaniswami: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం వీడనుంది. అన్నాడీఎంకే నేత పళనిస్వామి చేసిన అభినందన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Palaniswami: తమిళనాడులో కొత్త ప్రభుత్వం.. పళనిస్వామి సంచలన పోస్ట్..!
Palaniswami: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి అన్నాడీఎంకే నేత పళనిస్వామి (EPS) ముందస్తుగా అభినందనలు తెలపడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
పార్టీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, పళనిస్వామి తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో.. "అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి నా హృదయపూర్వక అభినందనలు" అని పేర్కొన్నారు. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమని సంకేతాలిచ్చినట్లయింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. తాజాగా వీసీకే (VCK) కూడా విజయ్ వైపు మొగ్గు చూపడంతో టీవీకే కూటమి మెజారిటీ మార్కును చేరుకుంది. అయితే వీసీకే నుండి అధికారికంగా మద్దతు లేఖ అందాల్సి ఉండటంతో ఇప్పటివరకు సందిగ్ధం కొనసాగింది.
ఈ సందిగ్ధతకు తెరదించుతూ, టీవీకే అధినేత విజయ్ నేడు మరోసారి గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీలో విజయ్ తనకున్న బల నిరూపణకు సంబంధించిన లేఖలను సమర్పించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది. వీసీకే మద్దతు లేఖతో విజయ్ గవర్నర్ వద్దకు వెళ్తే, తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
తమిళ రాజకీయాల్లో నెలకొన్న ఈ అనిశ్చితికి నేటి భేటీతో ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది.




