Congress: కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మలా? రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ రేపు కాంగ్రెస్ నిరసన గర్జన!
Congress: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
Congress: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుండగా, రాజకీయ రణరంగం ఇప్పుడు రోడ్డెక్కింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం)ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది.
తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌పీసీసీ) అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై పిలుపు మేరకు రేపు (మే 8, శుక్రవారం) చెన్నైలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజా తీర్పును అగౌరవపరుస్తోందని కాంగ్రెస్ మండిపడింది. గవర్నర్ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి ఎ. గోపన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని అన్నాసాలై, తారాపూర్ టవర్ సమీపంలో ఈ ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి ఎ. గోపన్న ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి, ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
విజయ్ పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా గవర్నర్ తాత్సారం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ధర్నా ద్వారా కేంద్రంపై మరియు గవర్నర్ నిర్ణయంపై ఒత్తిడి పెంచాలని హస్తం పార్టీ భావిస్తోంది.




