TVK: మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ కసరత్తు.. గవర్నర్‌కు లేఖ రాసిన దళపతి..!

TVK: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠ. మ్యాజిక్ ఫిగర్‌కు 10 అడుగుల దూరంలో విజయ్ పార్టీ టీవీకే (TVK). విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. కాంగ్రెస్, పీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం?

Arun Chilukuri
Published on: 5 May 2026 1:14 PM IST
TVK
X

 TVK: మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ కసరత్తు.. గవర్నర్‌కు లేఖ రాసిన దళపతి..!

TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చించేందుకు విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. తనకు రెండు వారాల సమయం ఇస్తే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని గవర్నర్‌కు రాసిన లేఖలో విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ మరియు పీఎంకే (PMK) పార్టీలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మద్దతుకు ప్రతిఫలంగా రెండు పార్టీలు చెరో రెండు మంత్రి పదవులను డిమాండ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ చర్చల సారాంశం ప్రభుత్వం ఏర్పాటుపైనేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకే నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story