Tamil Nadu: తమిళనాడులో ఆగని సస్పెన్స్.. గవర్నర్ ఆంక్షలతో విజయ్ సీఎం పదవికి చిక్కులు?
Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ. గవర్నర్‌ను కలిసిన టీవీకే అధినేత విజయ్. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే రావాలని గవర్నర్ సూచన. సంఖ్యాబలం కోసం విజయ్ కసరత్తు.
Tamil Nadu: తమిళనాడులో ఆగని సస్పెన్స్.. గవర్నర్ ఆంక్షలతో విజయ్ సీఎం పదవికి చిక్కులు?
Tamil Nadu: తమిళనాడు రాజకీయ సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్, టీవీకే (తమిళ వెట్రి కజగం) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం దిశగా వేస్తున్న అడుగులకు 'మెజార్టీ' బ్రేకులు పడుతున్నాయి. గురువారం మరోసారి రాజ్‌భవన్ (లోక్‌భవన్) వెళ్లిన విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని ఆయన కోరారు.
విజయ్ అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించలేదని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే 118 మంది ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతు ఉండాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను సమర్పించిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ గవర్నర్‌ను కలవడం ఇది రెండోసారి. నిన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో విజయ్ గవర్నర్‌ను కలిశారు. అయితే, కాంగ్రెస్ మద్దతు కలిపినా మెజార్టీ మార్కు (118) అందకపోవడంతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. దీంతో సంఖ్యాబలాన్ని సమీకరించుకోవడంలో విజయ్ ఇప్పుడు నిమగ్నమయ్యారు. డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతు కూడగట్టడంపైనే ఇప్పుడు విజయ్ సీఎం పీఠం ఆధారపడి ఉంది.




