తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధం.. మద్దతు ఇచ్చేది ఎవరు?

Tamil Nadu Election Results 2026: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్: అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK). ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం? గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్.

Arun Chilukuri
Published on: 5 May 2026 11:17 AM IST
Tamil Nadu
X

తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధం.. మద్దతు ఇచ్చేది ఎవరు?

Tamil Nadu Election Results 2026: తమిళనాడు రాజకీయం కీలకమలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజార్టీ లేకపోవడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. విజయ్ వెంట ఎవరు కలిసిసొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోట్టయన్ చర్చలు జరుపుతున్నారు. టీవీకే కార్యాలయంలో ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం అయ్యారు. శాసనసభాపక్షం నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటునకు అహ్వానింతచాలని గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు టీవీకే అధినేత. ప్రభుత్వం ఏర్పాటునకు రెండు వారాలు గడువు కోరే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story