తత్కాల్ టికెట్ బుకింగ్‌కు మొబైల్ బెటరా? ల్యాప్‌టాప్ బెటరా? కన్ఫర్మ్ టికెట్ ఈజీగా పొందండిలా..!

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ప్రతి సెకను కీలకం. IRCTCలో మొబైల్ ఫోన్ ద్వారా త్వరగా కన్ఫర్మ్ టికెట్ వస్తుందా లేక ల్యాప్‌టాప్ ద్వారా వస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంది.

Venkat
Published on: 22 Nov 2026 8:48 PM IST
Tatkal Ticket Booking
X

తత్కాల్ టికెట్ బుకింగ్‌కు మొబైల్ బెటరా? ల్యాప్‌టాప్ బెటరా? కన్ఫర్మ్ టికెట్ ఈజీగా పొందండిలా..!

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో ప్రతి సెకను చాలా విలువైనది. పండుగ సీజన్‌లో సొంతూళ్లకు వెళ్తుంటారు. ముందుగా టికెట్ దొరకకపోతే చివరకు తత్కాల్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. కన్ఫర్మ్ టికెట్ వస్తే ప్రయాణం హాయిగా సాగుతుంది.

కానీ తత్కాల్ టికెట్ కొట్టడం అంత సులభం కాదు. బుకింగ్ సమయంలో IRCTC వెబ్‌సైట్ స్లో అవ్వడం, సెషన్ టైమ్ అవుట్ కావడం, పేమెంట్ ఫెయిల్ కావడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో చాలామందికి టికెట్ మిస్ అవుతుంది.

ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌తో బుక్ చేస్తే మంచిదా, స్మార్ట్‌ఫోన్‌తో త్వరగా బుక్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. అసలు ఏ డివైజ్‌లో సూపర్‌ఫాస్ట్ స్పీడ్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ డివైజ్‌లో సూపర్‌ఫాస్ట్ స్పీడ్ వస్తుంది?

నిజానికి IRCTCలో తత్కాల్ టికెట్‌కు ఎప్పుడూ ఇదే ఫాస్ట్ అని చెప్పే ఒకే డివైజ్ లేదు. మొబైల్, ల్యాప్‌టాప్ రెండింటికీ వాటి సొంత ప్రయోజనాలు ఉన్నాయి.

డివైజ్ కంటే కూడా సరైన టైమింగ్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఫాస్ట్ పేమెంట్ మెథడ్ చాలా ముఖ్యం. బుకింగ్ ఓపెన్ అయిన మొదటి 1-2 నిమిషాల్లోనే సీట్లు నిండిపోతాయి. కాబట్టి ముందస్తు సన్నద్ధతే కీలకం.

స్మార్ట్‌ఫోన్‌తో బుక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

IRCTC Rail Connect యాప్‌తో స్మార్ట్‌ఫోన్‌లో టికెట్ బుక్ చేయడం చాలా సులభం. అందులో లాగిన్ ప్రాసెస్ వేగంగా ఉంటుంది. ఒకవేళ సెషన్ లాగౌట్ అయినా మళ్లీ వెంటనే లాగిన్ అవ్వచ్చు.

ఫోన్‌లో UPI పేమెంట్ చేయడం చాలా ఈజీ. చాలామంది ఫోన్లలో ముందే PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లు ఉంటాయి. OTP, UPI పిన్ వెంటనే ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు.

మరో ప్లస్ పాయింట్ 5G నెట్‌వర్క్. మీ ఏరియాలో మంచి 5G సిగ్నల్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఫోన్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులు, స్టూడెంట్స్‌కు బాగా ఉపయోగపడుతుంది.

ల్యాప్‌టాప్‌తో బుక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇంట్లో కూర్చుని బుక్ చేసేవారికి ల్యాప్‌టాప్ మంచి ఆప్షన్. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల రైలు, సీటు, ప్రయాణికుల వివరాలు స్పష్టంగా చూడవచ్చు. పేరు, వయసు, ID వివరాలు టైప్ చేయడం కీబోర్డ్‌తో వేగంగా అవుతుంది.

ల్యాప్‌టాప్‌లో ఒకేసారి అనేక ట్యాబ్‌లు ఓపెన్ చేసి PNR స్టేటస్, ట్రైన్ షెడ్యూల్, ప్రత్యామ్నాయ రైళ్ల వివరాలు చూడవచ్చు. పదేపదే పేజీలు మారాల్సిన అవసరం ఉండదు.

Wi-Fi లేదా బ్రాడ్‌బ్యాండ్ వాడితే స్టేబుల్ కనెక్షన్ లభిస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ అప్-డౌన్ అయ్యే చోట ల్యాప్‌టాప్ + బ్రాడ్‌బ్యాండ్ కాంబినేషన్ బెటర్ ఫలితం ఇస్తుంది.

ఫైనల్‌గా ఏది బెస్ట్?

వేగంగా టైప్ చేయగలిగి, స్టేబుల్ Wi-Fi ఉంటే ల్యాప్‌టాప్ బెస్ట్. బయట ఉన్నా, UPIతో వెంటనే పేమెంట్ చేయాలన్నా స్మార్ట్‌ఫోన్ బెస్ట్. ముందుగానే IRCTCలో లాగిన్ అవ్వడం, ప్యాసింజర్ లిస్ట్ సేవ్ చేసుకోవడం, UPI రెడీగా ఉంచుకోవడం, 10 గంటలకు AC, 11 గంటలకు Non-AC బుకింగ్ సమయం గుర్తుంచుకోవడం ద్వారా కన్ఫర్మ్ టికెట్ ఛాన్స్ పెరుగుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.