Tejasvi Surya: రేవంత్ 'హైబ్రిడ్' విధానంపై తేజస్వీ సూర్య ఫైర్: అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలా?
Tejasvi Surya: నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని తప్పుబట్టిన తేజస్వీ సూర్య. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఇవ్వాలని పార్లమెంట్‌లో ఎద్దేవా.
Tejasvi Surya: రేవంత్ 'హైబ్రిడ్' విధానంపై తేజస్వీ సూర్య ఫైర్: అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలా?
Tejasvi Surya: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ ఓటింగ్/నియోజకవర్గాల కేటాయింపు' విధానంపై పార్లమెంట్‌లో చర్చ చెలరేగింది. నియోజకవర్గాల పునర్విభజనను రాష్ట్రాల జీడీపీ (GDP) లేదా ఆదాయంతో ముడిపెట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీవ్రంగా తప్పుబట్టారు.
పార్లమెంట్‌లో తేజస్వీ సూర్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. "సీఎం రేవంత్ రెడ్డికి ఇలాంటి వింత సలహాలు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి 'ఒక వ్యక్తి - ఒకే ఓటు' (One Person - One Vote) అనే సూత్రం వర్తిస్తుంది" అని స్పష్టం చేశారు.
ఆదాయాన్ని బట్టి ఓట్ల సంఖ్యను లేదా నియోజకవర్గాలను నిర్ణయించాలనుకోవడం మూర్ఖత్వమని తేజస్వీ సూర్య కొట్టిపారేశారు. "ఒకవేళ అదే నిజమైతే.. దేశానికి అత్యధికంగా పన్నులు చెల్లించే అంబానీ లాంటి వారికి లక్ష ఓట్లు ఇవ్వాల్సి ఉంటుంది" అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ఆదాయం, జీడీపీ అనేది ప్రతి ఏటా మారుతూ ఉంటుందని, దానిని ప్రాతిపదికగా తీసుకుని డీలిమిటేషన్ చేయడం అశాస్త్రీయమని ఆయన పేర్కొన్నారు.
జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరగకుండా చూడాలని, అందుకోసం జనాభాతో పాటు ఆ రాష్ట్రం దేశానికి అందిస్తున్న ఆదాయాన్ని (GDP) కూడా పరిగణనలోకి తీసుకునే 'హైబ్రిడ్ విధానాన్ని' రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపాదించారు. దీనిని బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా తిప్పికొట్టింది.




