Tejasvi Surya: 30 ఏళ్ల కల సాకారం: మహిళా రిజర్వేషన్లపై తేజస్వీ సూర్య కీలక ప్రసంగం..!
Tejasvi Surya: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల ఆటంకాలే కారణమని తేజస్వీ సూర్య విమర్శలు. 1996 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లును మోదీ ప్రభుత్వం అమలు చేయబోతోందని వెల్లడి.
Tejasvi Surya: 30 ఏళ్ల కల సాకారం: మహిళా రిజర్వేషన్లపై తేజస్వీ సూర్య కీలక ప్రసంగం..!
Tejasvi Surya: మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడానికి దశాబ్దాలుగా విపక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించారు. పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత విషయంలో ఈ బిల్లు ఒక చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు.
30 ఏళ్ల జాప్యానికి కారణం ఎవరు?
తేజస్వీ సూర్య తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. 1996లో మొదటిసారి ప్రతిపాదించిన ఈ బిల్లు, విపక్షాల ఆటంకాల వల్ల 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా నానుతున్న ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొలిక్కి తెచ్చిందని, ఈ ధైర్యవంతమైన నిర్ణయం పట్ల కేంద్రానికి అభినందనలు తెలిపారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్రను ఈ బిల్లు మరింత పటిష్టం చేస్తుందని, ఇది మహిళలకు నిజమైన రాజకీయ శక్తిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2029 నుంచి కొత్త చరిత్ర
ఈ బిల్లు ఆమోదం పొంది, 2029 నుంచి అమలులోకి రావడం ద్వారా దేశ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలవుతుందని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




