Bangalore: బెంగళూరులో తెలంగాణా యువ ఐటీ దంపతుల మృతి

Bangalore: బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

KVD Varma
Published on: 31 March 2026 5:15 PM IST
Bangalore: బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన దంపతులు ఆత్మహత్య
X

Bangalore

Bangalore: కుటుంబ కలహాల కారణంగా తెలంగాణకు చెందిన ఒక యువ ఐటీ దంపతులు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు . ఈ ఘటన కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త ఆత్మహత్య చేసుకున్న అనంతరం, భార్య కూడా 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది.

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న జంట

తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన 32 ఏళ్ల భాను చందర్ రెడ్డి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతదేహాన్ని చూసిన అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) వారి అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ దంపతులు ప్రైవేట్ కంపెనీలలో టెక్నీషియన్లుగా పనిచేసేవారు. వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఇటీవల కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది, వారు మానసిక ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడుతున్నారని అనుమానిస్తున్నారు.

భార్య లేని సమయంలో

సోమవారం నాడు భార్య ఇంట్లో లేని సమయంలో భాను చంద్రారెడ్డి తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఆ తర్వాత, షాజియా బయట నుంచి వచ్చింది. గది తలుపు లోపలి నుండి తాళం వేసి ఉండటాన్ని గమనించింది. చాలాసార్లు పిలిచినా ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె సెక్యూరిటీ గార్డులు, ఇరుగుపొరుగు వారి సహాయం కోరింది. వారంతా వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా భాను మరణించి కనిపించాడు.

ఆ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైన షాజియా, నిమిషాల వ్యవధిలోనే అదే అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా వీరి మరణాలను రెండు అసహజ మరణాలుగా కేసులు నమోదు చేశారు. దంపతుల మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే దంపతుల మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story