Tamil Nadu: ముగిసిన తమిళ సస్పెన్స్.. టీవీకేకు వీసీకే మద్దతు..!

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వీసీకే పార్టీ అధికారికంగా మద్దతు తెలపడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంఖ్యాబలం 118కి చేరింది.

Arun Chilukuri
Published on: 9 May 2026 5:14 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: ముగిసిన తమిళ సస్పెన్స్.. టీవీకేకు వీసీకే మద్దతు..!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి ఎండ్ కార్డ్ పడింది. టీవీకే (TVK) అధినేత విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించారు. బుధవారం వీసీకే (VCK) పార్టీ అధికారికంగా విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది.

వీసీకే అధినేత తిరుమావళవన్ తమ పార్టీ మద్దతు లేఖను టీవీకే నేత ఆదవ అర్జునకు అందజేశారు. దీంతో టీవీకే కూటమి బలం 118కి చేరుకుంది. మే 4న వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది (విజయ్ రెండు చోట్లా గెలవడంతో ప్రస్తుత బలం 107). మెజారిటీకి పది స్థానాల దూరంలో నిలిచిన తరుణంలో కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి.

బలబలాలు ఇలా:

టీవీకే (TVK): 107

కాంగ్రెస్: 05

వామపక్షాలు (CPI & CPM): 04

వీసీకే (VCK): 02

మొత్తం బలం: 118

ఇప్పటికే కాంగ్రెస్ మరియు వామపక్షాలు విజయ్‌కు జై కొట్టగా, తాజాగా వీసీకే రెండు స్థానాల మద్దతు తోడవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మార్కును విజయ్ కూటమి చేరుకుంది. ఈ పరిణామంతో తమిళనాట 'విజయ్' ప్రభంజనం అధికారికంగా మొదలైనట్లయింది.

మద్దతు లేఖలు అన్నీ సిద్ధం కావడంతో విజయ్ త్వరలోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరనున్నారు. దీంతో దళపతి విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం కేవలం లాంఛనమే అని తెలుస్తోంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల్లో ఒక సినీ నటుడు సొంత పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story