Fenugreek: స్కూల్‌కి మెంతి కూర వంటకం తెచ్చినందుకు రూ.50 ఫైన్..!
Fenugreek: జైనుల పండుగ పర్యూషన్ రోజున పాఠశాలకు మెంతి కూర వంటకం తెచ్చిన విద్యార్థులకు రూ.50 జరిమానా విధించిన పాఠశాల ఉదంతం వివాదాస్పదమైంది.
Fenugreek: స్కూల్‌కి మెంతి కూర వంటకం తెచ్చినందుకు రూ.50 ఫైన్..!
Fenugreek: మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమైంది. జైనుల పవిత్ర పండుగ 'పర్యూషన్' రోజున పాఠశాలకు ఇంటి నుంచి మెంతి కూర వంటకం తీసుకొచ్చినందుకు ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు రూ. 50 జరిమానా విధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఠాణె జిల్లాలోని భాయందర్ ప్రాంతంలో ఉన్న సదరు ప్రైవేటు పాఠశాల.. పర్యూషన్ వేళ మెంతి కూరతో పాటు అటువంటి కొన్ని కూరగాయలతో చేసిన వంటకాలను పాఠశాలలోకి తీసుకురావడాన్ని నిషేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవడానికి బదులుగా, పాఠశాల క్యాంటీన్‌లో రూ. 20 చెల్లించి భోజనం చేయాలనే నిబంధన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
పాఠశాలలో విద్యార్థులపై ఇటువంటి నిబంధనలు విధించి, జరిమానాలు వసూలు చేయడంపై వస్తున్న వార్తలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ పాఠశాలకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.




