Chandrapur: రోడ్డు ప్రమాదంలో గాయపడిన పులి టీ-84 శ్యామ్ మృతి!

Chandrapur: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో కారు ఢీకొని గాయపడిన టీ-84 శ్యామ్ ఆడపులి నాగ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 26 Nov 2026 12:31 PM IST
Chandrapur
X

Chandrapur: రోడ్డు ప్రమాదంలో గాయపడిన పులి టీ-84 శ్యామ్ మృతి!

Chandrapur: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీ-84 శ్యామ్ అనే ఆడపులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 19న చంద్రపూర్ జిల్లా సిందేవాహి–నాగ్‌పూర్ మార్గంలో రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు పులిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులి రహదారి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయింది.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పులిని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాల కారణంగా పులి మృతి చెందినట్లు సమాచారం.

సుమారు రెండేళ్ల వయసున్న ఆడపులిగా గుర్తించిన టీ-84 శ్యామ్.. సిందేవాహి తాలూకాలోని పడస్‌గావ్, బెండాడ, ధూమన్‌భేదా ప్రాంతాల్లో ముగ్గురు గ్రామస్థుల మృతికి కారణమైనట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పులి కదలికలపై గతంలో అటవీశాఖ నిఘా పెట్టింది.

అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ పులి మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.