Parlakhemundi: శ్రమదానంతో రహదారి నిర్మించుకున్న గండుపొదర్ వాసులు

Parlakhemundi: గజపతి జిల్లా గండుపొదర్ గ్రామస్తులు అధికారులు పట్టించుకోకపోవడంతో శ్రమదానంతో రహదారి నిర్మించుకుని 14 కి.మీ ప్రయాణాన్ని 3 కి.మీలకు తగ్గించుకున్నారు.

S.Anil, Gajapati Dst
Published on: 19 Sept 2026 8:22 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: శ్రమదానంతో రహదారి నిర్మించుకున్న గండుపొదర్ వాసులు

పర్లాఖెముండి: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ గ్రామానికి శ్రమదానంతో రహదారి నిర్మించుకొని రాకపోకులకు మార్గం సుగమమం చేసుకున్నారు. గజపతి జిల్లా ఆర్ ఉదయగిరి సమితి డబరగూడ పంచాయతీలోని గండుపొదర్ గ్రామంలో 18 కుటుంబాలకు పైగా జీవనం కొనసాగిస్తున్నారు.

కొండ ప్రాంతం కావడంతో సరైన రోడ్డు లేక అత్యవసర సమయాల్లో స్థానికులు ఇబ్బందులు పడుతుండేవారు. తమ గ్రామానికి రహదారి నిర్మించండి మహాప్రభో అని ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా ఏకమై శ్రమదానానికి పూనుకున్నారు.

కాయ కష్టం చేసుకుని జీవన ఉపాధి పొందే గ్రామస్తులు పనులకు వెళ్లకుండా చిన్న పెద్ద అంతా కలిసి శ్రమదానంతో రహదారిని నిర్మించుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళేందుకు ఓవైపుగా 14 కిలోమీటర్లు రహదారి ఉండగా , ఆ రహదారి గుండ ఆలస్యం అవుతుందని, ఈ ప్రాంతం మీదుగా రహదారి నిర్మాణం జరిగితే సుమారు 3 కిలోమీటర్ల కే గమ్యస్థానానికి చేరుకుంటామని అన్నారు.

ప్రతిరోజు గుంతల రహదారిలో వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని ముఖ్యంగా విద్యార్థులకు చదువులు, గ్రామస్తుల మౌలిక సదుపాయాలు తమకు సమకూర్చుతాయని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టి సారించి పక్క రహదారి నిర్మించాలని కోరారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst