Jharkhand: ఝార్ఖండ్‌లో విషాదం.. కరం వేడుకల నిమజ్జనోత్సవంలో ఐదుగురు మృతి!
Jharkhand: ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో కరం వేడుకల సమయంలో విషాదం చోటుచేసుకుంది. పూజించిన చెట్టు కొమ్మను కోయల్ నదిలో నిమజ్జనం చేస్తుండగా ఐదుగురు నీట మునిగి మృతి చెందారు.
Jharkhand: ఝార్ఖండ్‌లో విషాదం.. కరం వేడుకల నిమజ్జనోత్సవంలో ఐదుగురు మృతి!
Jharkhand: ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంప్రదాయబద్ధంగా జరుపుకున్న 'కరం' వేడుకల ముగింపు సందర్భంగా నదిలో పూజా సామగ్రిని నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఐదుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉండటంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
పాలము జిల్లాలోని మారుమూల బొకాయ గ్రామంలో మంగళవారం ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయ ‘కరం’ పండుగను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పూజించిన ప్రత్యేక చెట్టు కొమ్మను బుధవారం తెల్లవారుజామున స్థానిక కోయల్ నదిలో నిమజ్జనం చేయడానికి గ్రామస్థులంతా కలిసి నది ఒడ్డుకు వెళ్లారు.
ఈ క్రమంలో కొమ్మను నీటిలో వదిలేందుకు ఐదుగురు యువకులు, పిల్లలు నదిలోకి దిగారు. అయితే, ప్రస్తుతం నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వారు ఒక్కసారిగా పట్టుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
నీట మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ఒడ్డున ఉన్న స్థానికులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం నదిలో నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. పండుగ రోజున జరిగిన ఈ అనూహ్య ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.




