Parlakhemundi: సైకిల్ కడుగుతూ చెరువులో కాలుజారి పడి వ్యక్తి మునిగి మృతి!
Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా మోహన నియోజకవర్గ పరిధిలో దుర్గాష్టమి పండగ రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Parlakhemundi: సైకిల్ కడుగుతూ చెరువులో కాలుజారి పడి వ్యక్తి మునిగి మృతి!
Parlakhemundi: అందరూ దుర్గాష్టమి పూజలు చేసుకుంటున్న తరుణంలో ఓ ఇంట్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గజపతి జిల్లా మోహన రాణా పరిధిలోని రాణీఖంబా గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ మాలిక్ (36) గ్రామ సమీపంలోని ఓ చెరువు వద్ద సైకిల్‌ను శుభ్రం చేస్తుండగా కాలుజారి చెరువులో పడిపోయాడు.
వెంటనే ఆయన భార్య గ్రామస్తులను పిలవడంతో అంతా చెరువులో గాలింపు చేపట్టారు. అనంతరం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బాధితుడికి నలుగురు కుమార్తెలు ఓ కుమారుడు ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని స్థానికులు కోరారు.




