Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్.. అక్కడ అన్ని శనివారాలు సెలవు.!

Tripura Govt Declares All Saturdays as Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగుల్లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పెంచేందుకు గాను ఇకపై అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Ravi
By Ravi
Published on: 10 Jun 2026 7:01 PM IST
Tripura Govt Declares All Saturdays as Holidays for Work-Life Balance
X

Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్.. అక్కడ అన్ని శనివారాలు సెలవు.!

Tripura Govt Declares All Saturdays as Holidays: ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవితంలో ఉద్యోగులకు 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది చాలా అవసరంగా మారింది. ఐటీ లేదా ప్రైవేట్ రంగాల్లో వారానికి ఐదు రోజుల పనిదినాల సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనూ దీనిని అమలు చేస్తూ త్రిపుర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదివరకు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై ఉద్యోగులకు అన్ని శని, ఆదివారాలు పూర్తిగా సెలవులు ఉండనున్నాయి. వారానికి ఒక రోజు సెలవు అదనంగా ఇస్తున్నందుకు గాను, ప్రభుత్వం పనిదినాల్లో రోజువారీ ఆఫీస్ పనివేళలను పొడిగించింది.

ఇదివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న ఆఫీస్ వేళలను మార్చారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story