Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ.. విఐపీ గ్యాలరీలో మెరిసిన త్రిష!

Trisha Krishnan: చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో సీఎం విజయ్ జాతీయ జెండా ఆవిష్కరించగా, వేడుకల్లో పాల్గొన్న నటి త్రిష. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పక్కనే కూర్చున్న దృశ్యాలు వైరల్.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 12:41 PM IST
Trisha Krishnan
X

Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ.. విఐపీ గ్యాలరీలో మెరిసిన త్రిష!

Trisha Krishnan: తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో నటుడు, ముఖ్యమంత్రి విజయ్ అలాగే నటి త్రిష కృష్ణన్ మధ్య బంధంపై వస్తున్న రూమర్లకు మరొక పరిణామం మరింత ఆజ్యం పోసింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో శనివారం ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, ప్రభుత్వ ప్రోటోకాల్ వేడుకలో త్రిష ప్రత్యక్షమవ్వడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.

స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా విఐపీలు మరియు విశిష్ట అతిథుల కోసం కేటాయించిన ముందు వరుస సీట్లలో త్రిష ఆసీనులయ్యారు. విశేషమేమిటంటే.. సీఎం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ పక్కనే ఆమె కూర్చోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

బంగారు వర్ణం సంప్రదాయ చీరకట్టులో, పరిమిత ఆభరణాలతో ఎంతో హుందాగా హాజరైన త్రిష.. చుట్టూ ఉన్నవారితో సంతోషంగా ముచ్చటిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభలోనూ త్రిష పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా హాజరుకావడంతో, వీరిద్దరి అనుబంధంపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ఈ పరిణామం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల నుండి కోలీవుడ్ వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story