TVK: తమిళ రాజకీయాల్లో 'విజయ్' మార్క్ వ్యూహం.. గవర్నర్ భేటీకి రంగం సిద్ధం?
TVK: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం! టీవీకే అధినేత విజయ్ తన నివాసాన్ని నీలాంగరై నుంచి గవర్నర్ హౌస్‌కు దగ్గరగా ఉన్న పట్టినపాకమ్‌కు మార్చారు.
TVK: తమిళ రాజకీయాల్లో 'విజయ్' మార్క్ వ్యూహం.. గవర్నర్ భేటీకి రంగం సిద్ధం?
TVK: తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన నివాసాన్ని తాత్కాలికంగా మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నీలాంగరైలోని తన నివాసం నుండి ఆయన గవర్నర్ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న పట్టినపాకమ్‌లోని తన ఇంటికి బయలుదేరారు.
రాజభవన్ సమీపంలోనే విజయ్ మకాం వేయడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీసీకే (VCK) పార్టీ నుండి మద్దతు లేఖ అందితే, విజయ్ నాలుగోసారి గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. తమ డిమాండ్ల సాధనలో భాగంగా వీసీకే నాయకత్వం టీవీకేతో జరిపిన చర్చలు సఫలమైనట్లు సమాచారం.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీవీకేను వీసీకే ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కుదిరిన అండర్‌స్టాండింగ్ ప్రకారం.. విజయ్ గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




