Tamil Nadu: కూటమి సర్కార్‌కు లైన్ క్లియర్.. వామపక్షాలు, వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
Tamil Nadu: విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు ఈ సాయంత్రం అధికారికంగా సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.
Tamil Nadu: కూటమి సర్కార్‌కు లైన్ క్లియర్.. వామపక్షాలు, వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
Tamil Nadu: తమిళనాడులో గత మూడు రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. చిన్న పార్టీలతో విజయ్ జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో, అవసరమైన సంఖ్యాబలం సమకూరినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం విజయ్ జరిపిన చర్చలు ఫలించాయి. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించగా, తాజాగా వామపక్షాలు (CPI, CPM) మరియు వీసీకే (VCK) కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే కూటమి బలం 118కి చేరింది.
అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే మరో ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరం ఉంది. దీనికోసం డీఎండీకే (DMDK) పార్టీతో విజయ్ బృందం చర్చలు జరుపుతోంది. మద్దతు లేఖలతో విజయ్ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయన కోరనున్నారు.
కూటమిలో పార్టీల వారీగా బలం:
పార్టీ | ఎమ్మెల్యేల సంఖ్య |
టీవీకే (TVK) | 107 |
కాంగ్రెస్ | 5 |
సీపీఐ | 2 |
సీపీఎం | 2 |
వీసీకే | 2 |
మొత్తం | 118 |




