Chandrapur: చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు.. మహిళ మృతి!

Chandrapur: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ముల్ తాలూకాలో ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పులులు దాడి చేయడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 12 Nov 2026 11:00 AM IST
Chandrapur
X

Chandrapur: చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు.. మహిళ మృతి!

Chandrapur: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ముల్ తాలూకాలో పులుల దాడులు కలకలం రేపాయి. ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పులులు ఇద్దరిపై దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ముల్ తాలూకాలోని పేరుకుట గ్రామ సమీపంలో పొలంలో పనిచేస్తున్న దయారాం కేశవ్ మొహుర్లే (66)పై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు తాడాలా గ్రామంలో పొలంలో పనిచేస్తున్న సంగీత పెడుక్కర్ (55)పై పులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు మృతురాలి కుటుంబానికి రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అటవీ సిబ్బందితో గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు.

గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వరుస పులుల దాడులతో ముల్ తాలూకాలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.