కారవాన్లు, మేకప్ మ్యాన్లు కూడా వస్తారేమో.. సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సెటైర్లు.!

Udhayanidhi Stalin : తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా డిఎంకె (DMK) నేత, ప్ర

G Krishna
Published on: 23 Jun 2026 2:18 PM IST
udhayanidhi stalin
X

udhayanidhi stalin 

Udhayanidhi Stalin : తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా డిఎంకె (DMK) నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్ సినిమా నేపథ్యాన్ని టార్గెట్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

అసెంబ్లీలో ‘లైట్స్, కెమెరా, యాక్షన్’..

ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీని ఒక సినిమా థియేటర్‌లా మార్చేశారని ఉదయనిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. "సీఎం విజయ్ అసెంబ్లీలో కూడా తన నటనను ఆపలేదు. ఆయన లోపల నటిస్తుంటే.. స్పీకర్ ఏమో 'కట్' అంటున్నారు, మళ్లీ స్పీకర్ 'యాక్షన్' అనగానే విజయ్ నటన మొదలుపెడుతున్నారు" అంటూ ఘాటుగా విమర్శించారు. సభ సాగుతున్న తీరు చూస్తుంటే చట్టసభలా కాకుండా షూటింగ్ స్పాట్‌లా అనిపిస్తోందని మండిపడ్డారు.

రేపటి నుండి కారవాన్లు, మేకప్ మ్యాన్లు వస్తారేమో

ఈ సినిమా రాజకీయం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసెంబ్లీకి సరికొత్త హంగులు రాబోతున్నాయంటూ ఉదయనిధి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "సభ నడుస్తున్న తీరు చూస్తుంటే.. రేపటి నుంచి సీఎం విజయ్ కోసం అసెంబ్లీ ప్రాంగణానికి కారవాన్లు, మేకప్ మ్యాన్లు, ఫైట్ మాస్టర్లు కూడా వచ్చేలా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి సభను రీల్స్, సినిమా డ్రామాలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు.

త్వరలో ఐటెం సాంగ్స్ డాన్సులు కూడా..

టీవీకే ప్రభుత్వంలోని మంత్రుల ప్రవర్తనపై కూడా ఉదయనిధి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ముఖ్యమంత్రి సభలోకి రాగానే మంత్రులంతా థియేటర్లో లాగా ఈలలు, విజిల్స్ వేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో అసెంబ్లీలోనే ఐటెం సాంగ్స్ పెట్టి డాన్సులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల అనంతరం ఏర్పడిన సరికొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, అసెంబ్లీ వేదికగా విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story