Union Cabinet Reshuffle 2026: ఈ నెల 15న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. లిస్ట్ రెడీ!

Union Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది.

Arun Chilukuri
Published on: 13 July 2026 10:58 AM IST
Union Cabinet Reshuffle 2026
X

Union Cabinet Reshuffle 2026: ఈ నెల 15న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. లిస్ట్ రెడీ!

Union Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం సర్వ సిద్ధమయ్యింది. ఈ నెల 15న కేబినెట్‌‌ను సమూలంగా ప్రక్షాళన చేయనుంది. కేబినెట్‌లో చోటు దక్కేవారు అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు అధిస్టానం ముందస్తు సమాచారం ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో చోటు కోసం ఆశావహుల ఎదురు చూపులు చూస్తున్నారు.

ఇందులో మహిళలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వనున్నారు.‎ కొంత మంది కేంద్ర మంత్రులను తప్పించి.. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌ ఉంది. యథావిధిగా ఈ నెల 15న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేబినెట్‌లో చోటు దక్కేవారిని ఆహ్వానించనున్నారు. ఈసారి పూర్తిస్థాయిలో కేంద్ర కేబినెట్‌ కొలువుదీరనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story